రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా యలమంచిలి మండల పరిధిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనకాపల్లి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ మరియు వారి సిబ్బందితో కలిసి ఈ రోజు సాయంత్రం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.ఈ తనిఖీల్లో భాగంగా హెల్మెట్ ధరించకుండా మోటార్ సైకిళ్లు నడుపుతున్న వాహనదారులను గుర్తించి, వారికి భారీగా చలానాలు విధించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రాణ రక్షణకు హెల్మెట్ ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.