స్వీయగణనపై అవగాహనకై ఏలూరులో 5కె రన్ ప్రారంభించి  అధికారులు, ప్రజలతోకలిసి రన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

స్వీయగణనపై అవగాహనకై ఏలూరులో 5కె రన్ ప్రారంభించి  అధికారులు, ప్రజలతోకలిసి రన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

27/April/2026 06:51    Share:   

స్వీయగణన పై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి ఆన్లైన్  ప్రక్రియ చాలా సులువు, ప్రతీ ఒక్కరూ  స్వీయగణన చేసుకోవాలి
వాహనదారులకు, బస్సు ప్రయాణీకులు ప్రతీ ఒక్కరినీ కలిసి స్వీయగణనపై అవగాహన కలిగించిన కలెక్టర్
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,  ఏలూరు,  :  
స్వీయ గణనపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.  స్వీయగణనపై అవగాహనకై ఆదివారం ఏలూరులోని ఇండోర్ స్టేడియం నుండి  5కె రన్ ను జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. 5కె రన్  ఏలూరులోని ఇండోర్ స్టేడియం నుండి శాంతినగర్ వరకు మరియు తిరిగి ఇండోర్ స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ 16వ జనగణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు ప్రజలకు  https://se.census.gov.in పోర్టల్ ద్వారా స్వీయ గణనకు అవకాశం కల్పించిందన్నారు. వెబ్సైటు కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేరు, చిరునామా, గృహం, విద్యుత్, త్రాగునీరు వంటి ప్రాథమిక సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని, అనంతరం ఒక యూనిక్  కోడ్ వస్తుందన్నారు. జనగణన సిబ్బంది గణన సమయంలో ఇంటికి వచ్చినప్పుడు ఆ యూనిక్ కోడ్ సహాయంతో మిగిలిన వివరాలు నమోదు చేయడం జరుగుతుందన్నారు. స్వీయగణన  ఆన్లైన్  ప్రక్రియ చాలా సులువు అని,  ప్రతీ ఒక్కరూ స్వీయగణన చేసుకోవాలన్నారు.  స్వీయ గణన నమోదు పూర్తిగా స్వచ్ఛందమని అన్నారు. జాతీయ స్థాయి కార్యక్రమాన్ని సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ నమోదు ప్రక్రియ వల్ల ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయని లేదా ప్రయోజనాలు ఆగిపోతాయనే అనుమానాలు వద్దని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా దేశ,రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమమని వివరించారు.  సదరు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల మహిళలు, కూడా https://se.census.gov.in పోర్టల్ ద్వారా  స్వీయ గణన  చేసుకోవాలన్నారు.   జిల్లాలోని వివిధ అధికారులు ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, . అన్ని జనాభా సమూహాలను లక్ష్యంగా చేసుకుని గణన పూర్తి చేయడానికి మరియు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి, స్వీయ గణనపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.5కె రన్ లో రోడ్డుపై ప్రజలకు, ఆటో డ్రైవర్లు,  వాహనదారులను ఆపి స్వీయగణన గురించి కలెక్టర్ తెలియజేసారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులను కలిసి స్వీయగణన గురించి కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్  శ్రావణ్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కిషోర్, మున్సిపల్ కమిషనర్ ఏ. భానుప్రతాప్, డిఎంహెచ్వో డా. శోభ,  ఎంఆర్ఓ, డిఈఓ వెంకటలక్ష్మమ్మ , డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, , సెట్వెల్  సిఈఓ ప్రభాకర్, డిసిపీఓ సూర్య చక్రవేణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి ముక్కంటి, ఐసిడిఎస్ పిడి శారద, డిఆర్డిఎ పిడి విజయలక్ష్మి,మెప్మా పీడీ రాజబాబు,,డిఎం సివిల్ సప్లై శివరామమూర్తి,,డిఎస్డిఓ అజీజ్,పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter