అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోండి ... ఏ.పి. రైతు సంఘం

అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోండి ... ఏ.పి. రైతు సంఘం

23/March/2026 09:20    Share:   

​చోడవరం : మార్చి 22, 
గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వాన,  ఈదురుగాలుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్సి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పలు మండలాల్లో మొక్కజొన్న, రబి వరి,  మినుము, నువ్వులు, అపరాల పంటలు దెబ్బతిన్నాయిన్నారు.  అరటి, బొప్పాయి, కూరగాయలు, మామిడి, నిమ్మ తదితర పంటలు దెబ్బతిని కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు.​నూర్పిడికి సిద్ధంగా ఉన్న సమయంలో పంటలు నాశనం కావడంతో ఆరుగాలం శ్రమించిన రైతాంగం తీవ్ర ఆందోళనలో పడ్డారని, వ్యవసాయ పెట్టుబడులు,ఎరువులు,పురుగు మందులు,విత్తనాలు ట్రాక్టర్ల అద్దెలు,కూలీల ఖర్చులతో కుదేలైన రైతులకు ఈ ప్రకృతి విపత్తు కోలుకోలేని దెబ్బతీస్తోందన్నారు.దెబ్బతిన్న పంటలను అధికారులు  క్షేత్రస్థాయిలో గుర్తించి,అకాల వర్షాల వల్ల తడిసిన,రంగు మారిన,నాణ్యత తగ్గిన పంటలను నిబంధనలు సడలించి మద్దతు ధరలకే ప్రభుత్వం కొనుగోలు చేయలని విజ్ఞప్తి చేశారు.ఆహార పంటలకు ఎకరానికి రూ.50,000.​ఉద్యాన పంటలకు ఎకరానికి రూ.75,000.​వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.1,00,000 చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.​ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారని తెలిపారు.ధన్యవాదములు తో,రెడ్డిపల్లి అప్పలరాజు,ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి,భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి,.
Breaking News

Subscribe our Newsletter