పౌర సేవలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్ష
11/March/2026 07:50
Share:
వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరు, అందిస్తున్న పౌర సేవలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు అందిస్తున్న పౌర సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ, పాఠశాల, ఉన్నత విద్య తదితర విభాగాల పనితీరుపై చర్చించారు. మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, ఐటీ,ప్రణాళిక, మైనింగ్, పాఠశాల, ఉన్నత విద్యాశాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.