ఏలూరులో ఈ నెల 24న 6వ మెగా జాబ్‌మేళా: పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరులో ఈ నెల 24న 6వ మెగా జాబ్‌మేళా: పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బడేటి చంటి

22/June/2026 08:18    Share:   

రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించి, వారి భవిష్యత్తుకు మరింత భద్రత చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. దానిలో భాగంగానే ఈ నెల 24వ తేదీన ఏలూరులో 6వసారి నిర్వహించనున్న జాబ్‌మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన స్థానిక సర్‌ సీఆర్‌ రెడ్డి కళాశాల వేదికగా నిర్వహించనున్న జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే బడేటి చంటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు రాష్ట్రమంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు ఏలూరు నియోజకవర్గంలోనే 5సార్లు జాబ్‌మేళాలను నిర్వహించి సుమారుగా 680 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఇదేక్రమంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న జాబ్‌మేళాలో 13 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్న ఎమ్మెల్యే చంటి,,, 950 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకు నిరుద్యోగులు తమ పేర్లను ఎన్‌రోల్‌ చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, డిప్యూటీ మేయర్‌ కర్రి శ్రీనివాస్‌, డిస్ట్రిక్ట్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ కె. ప్రవీణ్‌, నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు, ఆర్‌ఎన్‌ఆర్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter