అనకాపల్లిలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వేడుకలు – వైభవంగా రథోత్సవం..
26/April/2026 16:04
Share:
అనకాపల్లి పట్టణంలో 1925 లో స్థాపించిన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంఘం ఆధ్వర్యంలో వైశాఖ మాస శుద్ధ దశమి ఆదివారం ఆలయంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం మహోత్సవాల ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున అమ్మవారిని ఉత్సవ విగ్రహాని ప్రత్యేక అలంకరణ చేసి వెండి రథంపై పట్టణమంతా ఊరేగింపు నిర్వహించారు. శ్రీ అమ్మవారి నామ భజన సంకీర్తనలతో, మేళ తాళాములతో వైభవంగా తిరువీధి మహోత్సవం జరిగింది. నిత్య ప్రార్థనలు, గోపూజ, శ్రీ నగరేశ్వర స్వామి శ్రీ జనార్ధన్ స్వామి వారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి భక్తులచే బియ్యాభిషేకం, శ్రీ అమ్మవారి మూల విరాట్ కు లక్ష మల్లెపూలతో అర్చన చేశారు, సామూహిక మహిళలచే లలిత సహస్ర నామ స్తోత్ర పారాయణం, భారీ అన్న సమారాధన, ఆలయం చుట్టూ వెండి రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తో 102 రకాల స్వీట్లు తో ప్రదర్శన జరిగింది, శ్రీ అమ్మవారికి ఊంజల్ సేవ, కోలాటము . ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వుప్పల రవిరామ్ జవహర్, కార్యదర్శి, శ్రీధరాల సోమరాజు, కోశాధికారి కడిమిశెట్టి అచ్యుతరామయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంధి వివిఎస్ మాణిక్యం, భక్తులు తదిరులు పాల్గొన్నారు