అనకాపల్లి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఎంపికలు,,,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని  పూజారి శైలజ

అనకాపల్లి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఎంపికలు,,,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని పూజారి శైలజ

20/March/2026 17:02    Share:   

అనకాపల్లి, మార్చి 20, 2026:
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP),అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (DSA) ఛైర్మన్ ఉత్తర్వుల మేరకు 'శాప్ లీగ్స్' లో భాగంగా జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ (35+ మరియు 45+ ఏళ్లు పైబడిన వారు) పురుషులు మరియు మహిళల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి (DYSO) శ్రీమతి పూజారి శైలజ ఒక ప్రకటనలో తెలిపారు.
పోటీల వివరాలు:
తేదీ: మార్చి 24, 2026 (మంగళవారం)ఉదయం 8:00 గంటలకు ఏ.ఎం.ఏ.ఎల్ (A.M.A.L) కాలేజ్ గ్రౌండ్స్, అనకాపల్లి.100 మీటర్లు,400 మీటర్లు,800 మీటర్లు,1500 మీటర్ల పరుగు పందాలు,లాంగ్ జంప్,షాట్-పుట్, డిస్కస్ త్రో,హై జంప్,జావలిన్ త్రో మరియు 4x400 రిలే.
ముఖ్య గమనికలు:
రిజిస్ట్రేషన్: ఈ పోటీలలో పాల్గొనదలచిన క్రీడాకారులు తప్పనిసరిగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) అధికారిక వెబ్ సైట్ sports.ap.gov.in నందు తమ ఆధార్ కార్డు ద్వారా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే జిల్లా స్థాయి పోటీలకు అర్హులు.
కావలసిన పత్రాలు: ఆధార్ కార్డు జిరాక్స్ మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో వెంట తీసుకురావాలి.
రాష్ట్ర స్థాయి పోటీలు: జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మార్చి 30, 31 తేదీలలో గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది.
మరిన్ని వివరాల కోసం ఈ క్రింది కోచ్‌లను సంప్రదించగలరు:కే. త్రిమూర్తులు (బాక్సింగ్ కోచ్): 9332777778 రమేష్ (టైక్వాండో కోచ్): 8125416870
జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.
జిల్లా క్రీడాభివృద్ధి అధికారి,జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (DSA),అనకాపల్లి.
 

Breaking News

Subscribe our Newsletter