ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల అవగాహన ర్యాలీ

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల అవగాహన ర్యాలీ

29/March/2026 15:03    Share:   

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన ర్యాలీ – గ్రామంలో చైతన్యం నింపిన విద్యా ప్రచారం..!
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్,
యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలోని ఎంపీపీ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కలిసి గ్రామ వీధుల్లో ప్రదర్శన నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా స్కూల్ హెచ్‌.ఎం జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పుస్తకాలు, యూనిఫార్మ్‌లు, మధ్యాహ్న భోజనం వంటి అనేక సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్, కూటమి నాయకులు, కాండ్రకోట చిరంజీవి, అన్నం సరోజరావు, ఊడి రామకృష్ణ, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
ఈ ర్యాలీ ద్వారా గ్రామంలో విద్యపై అవగాహన పెరగడంతో పాటు ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్లపై మంచి స్పందన రావడం విశేషంగా నిలిచింది.
Breaking News

Subscribe our Newsletter