గోదావరి జిల్లా నిరాశ్రయుల వసతి గృహాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సందర్శన..

గోదావరి జిల్లా నిరాశ్రయుల వసతి గృహాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సందర్శన..

14/May/2026 21:24    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఎం.శ్రీలక్ష్మి  స్థానిక పత్తేబాదలోని పట్టణ నిరాశయులు వసతి గృహాన్ని  బుధవారం సందర్శించారు. వసతి గృహంలో సభ్యులకు అందిస్తున్న ఆహార పదార్థాలను నాణ్యత, మరియు పరిసరాలు పరిశుభ్రత మరియు  కనీస సౌకర్యాలను పరిశీలించారు. 
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఎం.శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు  పొందడం కోసం సంబంధిత అధికారులకు అర్జీ చేసుకోవడానికి, వైద్య మరియు ఇతర అవసరాలకు సహాయకులుగా  పారా లీగల్ వాలంటీరును నియమిస్తామని తెలిపారు. వీరు వృద్ధులకు సహాయకులుగా పనిచేస్తారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే వసతి గృహంలోని సభ్యులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో యాజమాన్యానికి సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వసతిగృహం ప్రతినిధులు, వృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter