అచ్యుతాపురం, మార్చి 30:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణాంధ్ర విజన్ - 2047'లో భాగంగా P4 (Public Private People Partnership) విధానం ద్వారా పేదలను సంపన్నులుగా మార్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్పష్టం చేశారు.
'జీరో పావర్టీ P4' కార్యక్రమం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అచ్యుతాపురం మండలం ఏపీఐఐసీ (APIIC) కన్వెన్షన్ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా, సమాజంలోని అణగారిన వర్గాలను సంపన్నుల సహకారంతో ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఈ P4 విధానం అద్భుతంగా తోడ్పడుతోందని తెలిపారు. ఏడాది కాలంలోనే ఈ విధానం ఆశించిన ఫలితాలను ఇస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ (DPO), నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, మార్గదర్శకులు, బంగారు కుటుంబాల P4 యూనిట్ సభ్యులు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.