ఏటికొప్పాక రైతుల ఆశల కేంద్రంగా షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.. ఎంపీ సీఎం రమేష్‌కు వినతి...!

ఏటికొప్పాక రైతుల ఆశల కేంద్రంగా షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.. ఎంపీ సీఎం రమేష్‌కు వినతి...!

21/June/2026 08:29    Share:   

అనకాపల్లి జిల్లా, జూన్ 20 (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "ఖేత్ బచావో అభియాన్" కార్యక్రమంలో ఏటికొప్పాక రైతుల సమస్యలు ప్రధాన చర్చాంశంగా నిలిచాయి. అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎలమంచిలి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు శెన్నంశెట్టి శ్రీను నాయకత్వంలో రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లుగా మూతపడిన ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాన్ని నాయకులు బలంగా ప్రస్తావించారు. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమైతే వేలాది మంది చెరకు రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు మరియు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారు.
రైతుల అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు నగిరెడ్డి సత్యనారాయణ,మండల అధ్యక్షులు కుమార్ స్వామి,రూరల్ ప్రచార కార్యదర్శి ధార నూకరాజు, ఆర్టిజన్ సెల్ నాయకులు మొల్లేటి ప్రసాద్, రైతులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter