అనకాపల్లిలో ఆర్ అండ్ బి విఫలం – ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా

అనకాపల్లిలో ఆర్ అండ్ బి విఫలం – ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా

15/April/2026 14:42    Share:   

అనకాపల్లిలో రోడ్ల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది. శారద నగర్ రోడ్లు, రైల్వే స్టేషన్ రోడ్లు, తుమ్మపాలు వెళ్లే రోడ్లు, భజనకొండకు వెళ్లే రోడ్లు ఒకప్పుడు గుంతలుగా ఉండగా, ఇప్పుడు చెరువుల్లా మారిపోయాయి. రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.108 అంబులెన్స్ వాహనం గోతుల్లో పడడంతో పేషెంట్‌కు ఆక్సిజన్ గొట్టం ఊడిపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంపై అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. కలెక్టర్ గారికి మూడుసార్లు లేఖలు ఇచ్చినా స్పందన లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ ప్రజలు ప్రయాణించే రహదారులను బాగు చేయకపోవడం అన్యాయమని పార్టీ నేతలు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఆర్ అండ్ బి అధికారులు స్పందిచి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పరిస్థితి కొనసాగితే నిరాహార దీక్షలు, శిబిరాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు, వేగి మహాలక్ష్మి నాయుడు, షేకు హుస్సేన్, తోటకి నాయుడు, నాగేందర్ రెడ్డి, ఎం. నారాయణరావు పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter