డైట్ లో విజయవంతంగా ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

డైట్ లో విజయవంతంగా ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

24/April/2026 19:13    Share:   

డైట్ కళాశాలలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ విజయవంతంగా ముగిసినది
దాడి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ,అటానమస్. నందు  ఫ్యాకల్టీ సభ్యుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్  విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 24 వరకు నాలుగు రోజులపాటు నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని  కళాశాల ప్రిన్సిపాల్  ఆర్ . వైకుంట రావు ,మరియు సి ఎస్ ఇ  - సి ఎస్ ఏం డి  విభాగాల అధిపతులు ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్‌గా డాటాప్రో సంస్థలో  ఆర్ & డి  విభాగాధిపతి శ్రీ విజయ్ కుమార్ లోకనాదం గారు పాల్గొన్నారు.“వర్క్ ఫ్లూ ఆటోమేషన్ టూల్స్  మరియు అజెంటిక్  ఏఐ “ అనే ఆధునిక సాంకేతిక అంశంపై ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో ఫ్యాకల్టీ సభ్యులకు ఆటోమేషన్ టూల్స్ వినియోగం, ఏఐ ఆధారిత ఏజెంట్ల రూపకల్పన, రియల్ టైమ్ అప్లికేషన్లు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు ఈ శిక్షణ ద్వారా తమ బోధన విధానాలను ఆధునీకరించుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత టెక్నాలజీలను విద్యా రంగంలో ఎలా సమర్థవంతంగా వినియోగించాలో వివరించారు.
కళాశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు రిసోర్స్ పర్సన్ గారికి, కార్యక్రమ నిర్వాహకులకు మరియు పాల్గొన్న ఫ్యాకల్టీ సభ్యులకు అభినందనలు తెలిపింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ, “ఇప్పటి విద్యా ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. అధ్యాపకులు ఆధునిక ఏఐ సాధనాలను అవగాహన చేసుకుని, వాటిని బోధనలో మరియు పరిశోధనలో వినియోగించడం ఎంతో అవసరం. ఈ ఎఫ్ డి పి  ద్వారా ఫ్యాకల్టీకి ప్రాక్టికల్ పరిజ్ఞానం పెంపొందించడమే మా లక్ష్యం” అని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా అధ్యాపకులు పరిశోధనలో కొత్త ధోరణులను అవగాహన చేసుకుని, విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Breaking News

Subscribe our Newsletter