క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ యలమంచిలి : తిరుపతి జిల్లా వీ కోట మండలంలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రూరల్ ఎస్‌ఐ ఉపేంద్రకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రుద్ర సింహాచలం (సింహాద్రి) మాట్లాడుతూ, సమాజానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ప్రభుత్వం-ప్రజల మధ్య వారధిగా పనిచేసే పాత్రికేయుల భద్రత సమాజ బాధ్యత అని అన్నారు. అలాంటి విలేకరులపై దాడులు, హత్యలు జరగడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆడారి గంగాధర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీమాన్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి సిహెచ్ సంతోష్, సీనియర్ పాత్రికేయులు పెద్దింటి సూర్యనారాయణమూర్తి, అల్లిమల్లి రాజు, గణేష్, రమణారావు, ఆర్.ఎస్. నాయుడు, ప్రసాద్, రాము, లోకేష్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. “పాత్రికేయులపై దాడులు ఆగాలి – జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి” అని నిరసనకారులు నినాదించారు.