యలమంచిలి రాంనగర్ రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత !
16/March/2026 19:00
Share:
రాంనగర్ రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్ ) యలమంచిలి : అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న లెవల్ క్రాసింగ్ నంబర్ 475, అంటే రాంనగర్ రైల్వే గేటు వద్ద అత్యవసర రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పనుల కారణంగా యలమంచిలి నుండి పెదపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఈ రైల్వే గేటును నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పూర్తిగా మూసివేయనున్నారు.ప్రజల భద్రత దృష్ట్యా చేపడుతున్న ఈ మరమ్మత్తు పనుల వల్ల సుమారు ఎనిమిది రోజుల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ట్రాఫిక్‌ను ఎర్రవరం రోడ్డు రైల్వే అండర్ బ్రిడ్జి మార్గం ద్వారా మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ విషయమై తుని సెక్షన్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ యలమంచిలి మండల రెవెన్యూ అధికారికి సమాచారం అందించారు. స్థానిక పోలీసులు, మున్సిపల్ అధికారులు మరియు ఆర్టీసీ యంత్రాంగం కూడా ఈ మార్పులను గమనించి ప్రజలు సహకరించాలని కోరారు.