యలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం
07/March/2026 07:10
Share:
యలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతి రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రజలను కోరడం జరిగింది. ప్రతి శుక్రవారం సమస్య ఉన్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి టిడిపి పట్టణ అధ్యక్షులు గొర్లె శివన్నారాయణ, రాష్ట్ర యాదవ్.కార్పొరేషన్ డైరెక్టర్ దూళి రంగనాయకులు, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, టౌన్ ఐ టి డి పి ఇంచార్జ్ పెయ్యల రామకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్లి. బాబురావు, గుర్రాల రాము, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.