నర్సింగబిల్లిలో ఉచిత వైద్య శిబిరం,ప్రత్యేక వైద్య పరీక్షలు – ఎక్స్‌రే సేవలు !

నర్సింగబిల్లిలో ఉచిత వైద్య శిబిరం,ప్రత్యేక వైద్య పరీక్షలు – ఎక్స్‌రే సేవలు !

15/May/2026 14:53    Share:   

క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ ఏ 
అనకాపల్లి నర్సింగబిల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహణ
నర్సింగబిల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం నిర్వహించిన మెడికల్ క్యాంప్‌కు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఛాతీ సంబంధిత సమస్యలు ఉన్న వారికి ప్రత్యేకంగా ఎక్స్‌రే పరీక్షలు చేసి అవసరమైన వైద్య సూచనలు అందించారు.
క్యాంప్‌లో వైద్య సిబ్బంది ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణ, పరిశుభ్రత ప్రాముఖ్యతపై వివరించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవలను వినియోగించుకున్నారు. ప్రజలకు దగ్గర్లోనే వైద్య సేవలు అందించడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నర్సింగబిల్లి, చింతలపాలెం, గోబ్బూరు, ఎన్‌జీ పాలెం గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. వైద్య సేవలు అందించిన డాక్టర్లు, సిబ్బందిని గ్రామస్థులు అభినందించారు.
Breaking News

Subscribe our Newsletter