-
పేదలకు ఖరీదైన వైద్యసేవలు అందుబాటులోకి – ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం
-
ప్రతి గురువారం పవర్‌పేటలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
-
బిపి, షుగర్ పరీక్షలు – అవసరార్థులకు మందుల పంపిణీ
-
ప్రజారోగ్య రక్షణే ధ్యేయం – ఉచిత వైద్య శిబిరాల అంకురార్పణ
-
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఉచిత వైద్య శిబిరాలపై చర్చ
-
రెడ్‌క్రాస్ సహకారంతో నిపుణ వైద్యుల సేవలు ప్రజలకు అందుబాటులో
-
అవసరార్థులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచన
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ఖరీదైన వైద్యసేవలను పేదలకు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేయాలనుకుంటోన్న మంచేమిటో ప్రజలంతా అవగతం చేసుకుంటూ తమ సంపూర్ణ మద్దతును తెలపాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆలోచనల నుండి ఆవిష్కృతమైన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ప్రతి గురువారం మాదిరిగానే యధావిధిగా నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని పలువురు అవసరార్థులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరానికి విచ్చేసిన వారికి బిపి, షుగర్ వంటి వైద్యపరీక్షలను నిర్వహించిన వైద్యులు,,, అవసరమైన వారికి మందులను అందించారు. ఇదేసమయంలో వైద్య శిబిరం జరుగుతున్న తీరును స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, పలువురికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే వారికి పూర్తి భరోసా, రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి గురువారం ఉచితంగా వైద్య శిబిరాల నిర్వహణకు అంకురార్పణ చేశామన్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని కలిసిన సందర్భంలోనూ ఉచిత వైద్య శిబిరం నిర్వాహణాంశాన్ని ప్రస్తావించానన్న ఆయన,,, ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా తాము ఎంతో స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నామో ప్రజలంతా గమనించాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను ఎంతో వేగవంతంగా తీసుకుంటూనే వివిధ ఆసుపత్రుల అనుసంధానంతో, రెడ్‌క్రాస్ వంటి సంస్థల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ శిబిరంలో నిష్ణాతులైన వైద్యనిపుణులు ఎంతో విలువైన వైద్యసేవలను అందిస్తూ వస్తున్నారన్న ఎమ్మెల్యే బడేటి చంటి,,, ప్రజలు, అవసరార్థులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలంటూ సూచించారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టిడిపి జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం, సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్, పలువురు కార్పొరేటర్ లు, క్లస్టర్ ఇన్చార్జిలు, డివిజన్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు...