ఎండ తీవ్రతకు ఉపశమనం: అనకాపల్లిలో ఉచిత మజ్జిగ పంపిణీ చేసిన బంగారం వ్యాపారులు
06/June/2026 20:39
Share:
వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అనకాపల్లి పెరుగు బజార్‌లో బంగారం వర్తకులు ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. లోకోజి బాబు ఆధ్వర్యంలో పలువురు బంగారం వర్తకులు కలిసి స్థానిక ప్రజలు, వ్యాపారులు, ప్రయాణికులకు చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, మండుతున్న ఎండల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి సమయంలో చల్లటి మజ్జిగ పంపిణీ చేయడం ద్వారా కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్థానికులు బంగారం వర్తకుల సామాజిక బాధ్యతను అభినందిస్తూ,ప్రజా సంక్షేమం కోసం ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.వ్యాపారంతో పాటు సామాజిక సేవలోనూ తమ వంతు పాత్ర పోషిస్తున్న బంగారం వర్తకులు పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ ఏ.