ఏలూరులోనే తొలిసారి స్కూల్ స్థాయిలో సివిల్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం  

ఏలూరులోనే తొలిసారి స్కూల్ స్థాయిలో సివిల్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం  

07/June/2026 19:43    Share:   

ఉచిత డిజిటల్ బోధనతో చిన్నతనం నుంచే IAS, IPSపై అవగాహన - కరస్పాండెంట్ అర్చనా చౌదరి,ఇండియన్ ఎడ్యుకేషన్ సమిట్‌లో నేషనల్ అవార్డు గుర్తింపు

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, 
నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చిన్నతనం నుంచే లక్ష్యాలను నిర్దేశించుకుని, తల్లిదండ్రులపై ఎలాంటి అదనపు ఫీజులు, ఒత్తిడి లేకుండా క్లాస్‌రూంలోనే ఉచితంగా IAS, IPSపై అవగాహన కల్పించడమే తమ ధ్యేయమని అక్షర స్కూల్ కరస్పాండెంట్ అర్చనా చౌదరి తెలిపారు.
ఆదివారం ఏలూరులోని అక్షర స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, స్కూల్ చైర్మన్ జవ్వాజి సురేంద్ర కుమార్ నేతృత్వంలో విద్యార్థుల కలను సాకారం చేసేందుకు సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. సమాజంలో అత్యున్నత స్థానాలైన IAS, IPS అధికారులు ప్రజలకు చేసే సేవలపై విద్యార్థులకు చిన్న వయసు నుంచే పూర్తి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.
డిజిటల్ + ప్రాక్టికల్ బోధన  
కేవలం పుస్తక పరిజ్ఞానికే పరిమితం కాకుండా ప్రతి అంశాన్ని విద్యార్థులకు డిజిటల్ రూపంలో, ప్రత్యక్షంగా బోధిస్తున్నామని కరస్పాండెంట్ తెలిపారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.
జిల్లాలోనే ఫస్ట్  
ప్రస్తుతం చాలా పాఠశాలలు ఒలింపియాడ్, IIT కోర్సులు నడుపుతున్నాయని, కానీ స్కూల్ స్థాయిలోనే సివిల్ సర్వీస్ అవేర్‌నెస్ కార్యక్రమాలను ఉచితంగా ప్రవేశపెట్టిన ఏకైక పాఠశాల తమ ‘అక్షర స్కూల్’ మాత్రమేనని ఆమె గర్వంగా ప్రకటించారు. ఏలూరు జిల్లాలోనే ఈ తరహా అవగాహన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా తామే ప్రారంభించామని వెల్లడించారు.
నేషనల్ అవార్డు  
విద్యార్థులను ఉన్నత అధికారులుగా తీర్చిద్దే లక్ష్యంతో తీసుకున్న ప్రత్యేక చొరవకు గుర్తింపుగా ఈ నెల 4వ తేదీన చెన్నైలో జరిగిన ఇండియన్ ఎడ్యుకేషన్ సమిట్‌లో నేషనల్ అవార్డు స్కూల్ యాజమాన్యానికి దక్కిందని అర్చనా చౌదరి తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడమే అక్షర స్కూల్ మేనేజ్‌మెంట్ లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అక్షర స్కూల్ ఇన్చార్జి కిరణ్, ఇన్చార్జి లలిత, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter