"మహిళా పోలీస్ స్టేషన్ మహిళలకు రక్షణ మరియు కౌన్సిలింగ్ కేంద్రంగా ఏర్పడాలి" – ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
21/April/2026 20:08
Share:
మహిళా పోలీస్ స్టేషన్ అంటేనే జిల్లా మహిళా లకు రక్షణ, కౌన్సిలింగ్ సెంటర్ గా ఏర్పడాలని జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వెల్లడి కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ వారు లు యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళలకు ప్రశాంత మైన వాతావరణం కల్పించడమే కాకుండా, వారిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపేల ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ భవన ప్రాంగణం రూపురేఖలు మారుతున్నాయి అని,ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ గోడలపై చిత్రలేఖన కార్యక్ర మాన్ని పోలీస్ అధికారులు అత్యంత వైభవంగా నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిని లు ఉత్సాహం గా పాల్గొని, సామాజిక అంశాలను ప్రతిబింబించేలా అద్భుతమైన చిత్రాలను చిత్రించారు.మహిళలకు ఏదైనా సమస్య ఎదురై నప్పుడు వారికి మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది మేము ఉన్నాం అని నమ్మకం ఆత్మీయతను, సహాయ సహకారాలను ఈ మహిళా పోలీస్ స్టేషన్ ద్వారా పొందా లనేదే తమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ గారు పేర్కొన్నారు.ప్రజలలో పోలీస్ స్టేషన్ అంటే భయం కలిగేలా కాకుండా భ్రమలు తొలగించేలగా, ఆహ్లాదకరంగా ఉండేలా ప్రాంగణం చుట్టూ గోడలపై ప్రజలకు అత్యవసర సమయా లలో పోలీసు వారి యొక్క సహాయ సహకారాలు ఏవిధంగా పొందాలి అనే విషయా లపై, శక్తి యాప్ వలన కలిగే ఉపయోగాలను గురించి చిత్ర లేఖనా లను వేయించి, సుందరంగా తీర్చి దిద్దడం జరుగుతోంది అని, మహిళా పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితు లతో పాటు వచ్చే వారి చిన్న పిల్లల తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించే సమయా లలో పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ ప్లే ఏరియా ను ఏర్పాటు చేశారు. రంగురంగుల బొమ్మలు, ఆట వస్తువులతో కూడిన ఈ ప్రాంతం పిల్లలకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అని మహిళలు తమ సమస్యలను నిర్భయం గా చెప్పుకునే వాతా వరణాన్ని కల్పించడం ద్వారా పోలీస్ వ్యవస్థ పై గౌరవాన్ని, నమ్మకాన్ని పెంపొందిం చాలని ఆయన ఆకాంక్షించారు.ఈ ప్రాంతంలో ఇప్పటికే ట్రాఫిక్ క్రాస్ రోడ్ పార్కును ఏర్పాటు చేసి పిల్లలకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ నియమ నిబంధనలను గురించి అవగాహన కల్పించే విధంగా ప్రత్యేకంగా ట్రాఫిక్ పార్క్ ను ఏర్పాటు చేయడ మైనది అని,ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగముగా మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని సుందరవందానముగా తీర్చిదిద్దడం జరుగుతుందని,ఈ ప్రాంతానికి రాగానే ప్రజలకు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నామని అనుభూతి కలగకుండా ఉండేలాగా సుందరంగా నిర్మించడం జరిగినదని రాబోయే తరం వారికి పోలీసు వ్యవస్థ పై నమ్మకం పెరిగేలాగా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంగణాలపై విద్యార్థిని విద్యార్థులు యొక్క సహకారంతో సుందరవందనముగా తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు దానికి ప్రజల యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు తెలియ చేసినారు.ఈ చిత్ర లేఖన కార్యక్రమమును ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ గారు ప్రత్యేకంగా రూపకల్పన చేసి సదరు చిత్ర లలో సామాజిక బాధ్యతలు మరియు ప్రజలకు అవసర మయ్యే విషయాలపై ప్రత్యేక శ్రద్ధను తీసుకొని పెయింటింగ్ లను చేసిన ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ గారిని ప్రత్యేకంగా అభినం దించిన జిల్లా ఎస్పీ గారు,ఏలూరు డీఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ యు. రవి చంద్ర, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు లను అభినందించిన జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ శ్రీ జీ ముని రాజా గారు, ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీ మల్లేశ్వర రావు డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ శ్రీ హనీబ్ భాష, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ లక్ష్మణరావు, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అశోక్ కుమార్, త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కోటేశ్వరరావు, మహిళా పి.ఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. సుబ్బారావు, ఎస్సైలు, మహిళా ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది, శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థినిలు, ఎన్నారై కాలేజీ విద్యార్థినిలు, ఇతర కాలేజీల యొక్క విద్యార్థినులు మరియు ఔత్సాహికులైనటు వంటి బాలికలు పాల్గొన్నారు.మహిళా సంక్షేమం మరియు భద్రత దిశగా ఏలూరు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న ఈ మార్పుపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది