మార్టూరు గ్రామంలో అనకాపల్లి రూరల్ పోలీస్ వారు అవగాహన కార్యక్రమం
17/May/2026 07:12
Share:
అనకాపల్లి మండలం మార్టూరు గ్రామంలో “100 డేస్ యాంటీ డ్రగ్ 2.0” కార్యక్రమం కింద మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, మహిళల భద్రత, మహిళలపై జరిగే నేరాల నివారణతో పాటు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు అనకాపల్లి రూరల్ సిఐ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.అదేవిధంగా రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని అవగాహన కల్పించారు.“మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి... ట్రాఫిక్ నిబంధనలు పాటించండి... మీ కుటుంబం కోసం మీ ప్రాణాలను కాపాడుకోండి” అని ప్రజలకు సూచించారు.మహిళల భద్రతకు సంబంధించి పోలీసులు తీసుకుంటున్న చర్యలు, మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్, డయల్ 112,100,1091 వంటి పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.