డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ ఘనంగా నివాళులు అర్పించిన ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్
14/April/2026 20:40
Share:
డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ గారి 135 వ జయంతి పురస్క రించుకొని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ గారి యొక్క చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లా డుతూ డాక్టర్. బాబా సాహెబ్ అంబే ద్కర్ అని పిలువబడే భీమ్రావ్ రాంజీ అంబేద్కర్,1891-1956 భారతీయ చరిత్రలో అత్యంత ప్రభావవంత మైన నాయకులలో ఒకరు. అతను సామా జిక సంస్కర్త, న్యాయ వాది, ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు భారత రాజ్యాంగం యొక్క ప్రధాన వాస్తు శిల్పి. అతను తన జీవితాన్ని సామాజిక వివక్ష మరియు అన్యా యానికి వ్యతిరేకంగా పోరాడటానికి అంకితం చేశారు.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే వివిధ దేశాలకు స్వాతంత్రం వచ్చిందని, ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజా స్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప దర్శినికయుడని, మనమందరం ఈరోజున యూని ఫాంలో ఉన్నామంటే రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అవకాశాలని అన్ని కులాలు మతాలు వారికి సమాన హక్కులు కల్పించి నటువంటి గొప్ప వ్యక్తి అని,రాజ్యాంగం ద్వారా ప్రతి సిస్టమ్ రూపొందించిన మహానుభావుడు వారి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా అందరం కలిసి ముందుకు వెళ్లాలని, కుల ప్రస్తావన అనేది లేకుండా ఉండాలని ఆ మహానుభావుడు యొక్క ఆలోచన విధానమని,మనకు ఉన్నవి రెండే కులాలని ఒకటి మంచి రెండు చెడు మాత్రమేనని మంచిని గ్రహించి చెడును విడనాడాలి అని పిలుపునిచ్చి నారు డాక్టర్.అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891 న, ప్రస్తుత మధ్య ప్రదేశ్లోని ఒక చిన్న పట్టణమైన Mhow లో జన్మిం చారు. అతను మహార్ కులానికి చెందినవాడు. అతను తెలివైన విద్యార్ధి. అతని తండ్రి ఆర్మీ అధికారి, అతను విద్య యొక్క శక్తిని విశ్వసించారు. అంబే ద్కర్ ప్రతిష్టాత్మక సంస్థల నుండి బహుళ డిగ్రీలను సంపాదిం చారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ మరియు పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పొందా రు. USA లోని కొలం బియా విశ్వవిద్యాల యంలో చదువు కున్నారు. అక్కడ అతను పిహెచ్ఎ పూర్తి చేశారు ఆర్థిక శాస్త్రంలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా చదువుకున్నారు మరియు లండన్లోని గ్రేస్ ఇన్ వద్ద న్యాయ వాది అయ్యారు.అంబేద్కర్ 1936 లో గాంధీ ఉద్యమము నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా దళిత సమస్యల పరిష్కా రానికి ఆలిండియా డిప్రె స్స్డ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీ లను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. స్వాతంత్ర్యం అనంతరం స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. దేశానికి రాజ్యాంగ రచన బాధ్య తలను అప్పగించిన నెహ్రూ.. ప్రభుత్వం భారత రాజ్యాంగ పరిషత్ నియమించిన రాజ్యాంగ సంఘానికి అంబేద్కర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసి దృఢమైన రాజ్యాం గాన్ని తయారు చేయ డంలో విజయం సాధించారు.తరతరాలుగా బడుగు, బలహీన వర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్. వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమి స్తాయని బలంగా నమ్మిన అంబేద్కర్. వారసత్వ, వివాహ చట్టాలలో లింగ సమా నత్వాన్ని వివరించ డానికి ప్రయత్నించారు.హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను పార్ల మెంటులో నిలిపి వేయడంతో. 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.1956 అక్టోబరు 14న నాగపూర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన అంబేద్కర్ తన జీవితంలోని ముఖ్యాంశాలను తన ఆత్మకథ 'వెయిటింగ్ ఫర్ ఏ వీసా'లో రాసు కున్నారు. దళితుల హక్కులు, అభ్యున్నతి కోసం జీవితకాలం పోరాటం చేసిన యోధుడిగా గుర్తింపు పొందారు.జనవరి 26, 1950 న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు.రాజ్యాంగం హామీ ఇస్తుందని ఆయన నిర్ధారించారు. 1990 లో అత్యున్నత భారత రత్న పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది అని, నేటి తరం యువతి యువకులు డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ గారు ఆదర్శప్రాయుడని తెలియ చేసినారు.ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ శ్రీ జీ ముని రాజా గారు, ఏ ఆర్ డీఎస్పీ శ్రీ చంద్ర శేఖర్ గారు, ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీ మల్లేశ్వర రావు గారు, ఆర్ ఐ పవన్ కుమార్ గారు, ఆర్.ఎస్.ఐ భాస్కర రావు, వెంకటేష్ లు, ఎస్ బి స్టాఫ్, డి సి ఆర్ బి స్టాఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు