డిసెంబర్‌ నాటికి అర్హులందరికీ టిడ్కో ఇళ్లు: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి..

డిసెంబర్‌ నాటికి అర్హులందరికీ టిడ్కో ఇళ్లు: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి..

16/July/2026 19:23    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
ఏలూరు, పేదవారి సొంతింటి కల సాకారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, దీనిలో భాగంగానే నియోజకవర్గంలోని అర్హులైన లబ్దిదారులందరికీ డిసెంబర్‌ నెలాఖరు నాటికి సకల సదుపాయాలతో టిడ్కో ఇళ్ళను అందించనున్నట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అదేలక్ష్యంతో ప్రస్తుతం పనులు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఏలూరు పోణంగి రోడ్డులో శరవేగంగా నిర్మితమవుతోన్న టిడ్కో గృహ సముదాయాల వద్ద లబ్దిదారుల సౌకర్యార్ధం మౌళిక సదుపాయాల కల్పనకు టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక దృష్టిసారించారు. దీనిలో భాగంగా గురువారం 500 ఎంఎల్‌డి ఎస్‌ఎల్‌ఆర్‌ సంపు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి సంపు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇదేసమయంలో నిర్దేశిత లక్ష్యం మేరకు మరింత వేగవంతంగా టిడ్కో ఇళ్ళ నిర్మాణాలను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజల కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని చెప్పారు. దానిలో భాగంగానే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన టిడ్కో గృహాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు వెల్లడించారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైపోయిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ వస్తోన్న కూటమి ప్రభుత్వాధినేతలు,,, టిడ్కో గృహాలను లబ్దిదారులకు అందించేందుకు ప్రత్యేక దృష్టిసారించారని స్పష్టం చేశారు. అలాగే టిడ్కో గృహాలు రద్దైన వారికి సైతం దఫదఫాలుగా డిడిలు అందిస్తూ వస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదేలక్ష్యంతో అక్టోబర్‌ నాటికి కొన్ని టిడ్కో గృహాలను, డిసెంబర్‌ నాటికి 40 టవర్లలోని 1920 గృహాలను సకల సదుపాయాలతో అభివృద్ధి చేసి లబ్దిదారులకు అందించనున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, డిప్యూటీ మేయర్‌ కర్రి శ్రీనివాస్‌, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కో-ఆప్షప్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, కో క్లస్టర్ ఇంచార్జ్ మెరుగుమాల శ్రీనివాసరావు, డివిజన్ ఇంచార్జ్ మెరుగు మాల ఏసు మని, కోడివిజన్ ఇంచార్జ్ దావూద్, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, స్థానిక నాయకులు ఉడి శేఖర్, కటికతల ఏసు, చుండ్రు యేసు పాదం, గొంగాడి బోసు, తెర్లి వెంకటేశ్వరరావు, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సెల్ మెంబర్  దొడ్డిగర్ల శుభమాలిక్, టిడ్కో ఎస్‌ఈ పి. గంగరాజు, ఏపీ టిట్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ టీవీ నారాయణరావు, అసిస్టెంట్ ఇంజనీర్ పూర్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter