P. బయ్యవరం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం  విజయవంతం..

P. బయ్యవరం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం  విజయవంతం..

24/July/2026 19:40    Share:   

ఎలమంచిలి: తేదీ 24-07-2026 న పి. బయ్యవరం ఎమ్. పి. యు. పి పాఠశాల యందు ప్రధానోపాధ్యాయుని బి. వి. ధనలక్ష్మి గారి అధ్యక్షతన ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించబడింది. ముందుగా తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ గావించి వారిని పిల్లల తరగతి గదులులో హాజరు పరిచి పిల్లల యొక్క విద్యా సామర్థ్యాలు గురించి ఉపాధ్యాయులు చర్చించి, వివిధ విద్యా వీడియోలను ప్రదర్శించడమైనది. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలును వివరించడం జరిగింది.1 నుండి 5వ తరగతుల విద్యార్థులుకు విరాళ ధాత భండారు బంగారు శెట్టి గారు(C A) నోట్ బుక్స్ అందజేసిరి మరియు విశ్రాంతి ఉపాధ్యాయులు పుల్లా వెంకటరావు గారు తల్లి గాని, తండ్రి గాని చనిపోయిన నలుగురు విద్యార్థులుకు నెలకు 500/- రూపాయలు చొప్పున 10 నెలలకు ఇచ్చుటకు గాను ఈ రోజు నలుగురుకి నగదు అందజేయడం జరిగింది. గ్రామ పెద్దలు గొన్న బత్తుల శేషు గారు టెంట్, కుర్చీలు,మైక్ ఏర్పాటు చేసిరి.గంజి శ్రీనివాసరావు తిది భోజనoలో స్వీట్ ఏర్పాటు చేసిరి.విద్యా కమిటీ చైర్మన్ S. రాజేశ్వరి గారు బంగాళ దుంప కుర్మా ఏర్పాటు చేసిరి.ఈ కార్యక్రమంలో తల్లికి వందనం, విద్యా కిట్,MDM, ఆరోగ్య పథకాలు,I F P,AI,F LN, DIKSHA మొదలగు వాటి గురించి చర్చించడమైనది. ఈ కార్యక్రమంలో పెద్దలు గొన్న బత్తుల శేషు, సానా నానాజీ, ఎడ్ల నారాయణరావు, రావూరి శ్రీనివాసరావు, ఎడ్ల నానాజీ, నాని, బుజ్జి, కాంతారావు, చిట్టిబాబు, ఉపాధ్యాయులు బొడ్డెడ సత్యనారాయణ,k. వీరభద్ర రావు, శోభారాణి, గౌతమి హాజరయ్యారు.
Breaking News

Subscribe our Newsletter