సెప్టెంబర్‌ మొదటివారం నుంచి నూతన పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం .

సెప్టెంబర్‌ మొదటివారం నుంచి నూతన పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం .

27/August/2026 19:30    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.

ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి.....
ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లా టిడిపి కార్యవర్గ సమావేశం బడేటి చంటి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యవర్గ సమావేశం నిర్వహించారు.సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన డోర్‌ టు డోర్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి నూతన పింఛన్ల కోసం ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే నెల మొదటివారం నుంచి నూతన పింఛన్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఎల్‌నినో ప్రభావంతో కొంతకాలంగా తాగునీటి సమస్య ఏర్పడినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడిందన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గంలో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తాను ఆయన తెలిపారు. అదేవిధంగా హౌసింగ్‌కు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేసే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యతను పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించినట్లు బడేటి చంటి తెలిపారు. నియోజకవర్గాల్లో ఉన్న చిన్నపాటి సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ కూటమి విజయానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సెక్రటరీ జగ్గవరపు ముత్తారెడ్డి, ఉపాధ్యక్షులు గుడవలి శ్రీనివాస్, ఉప్పలపాటి రాంప్రసాద్, బొప్పన సుధాకర్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, నగర టిడిపి అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, రెడ్డి నాగరాజు తో పాటు పలువురు మహిళా నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter