ఏటికొప్పాక అంగన్‌వాడీ కేంద్రంలో కిషోర్ వికాస.భద్రత కార్యక్రమం..!

ఏటికొప్పాక అంగన్‌వాడీ కేంద్రంలో కిషోర్ వికాస.భద్రత కార్యక్రమం..!

19/May/2026 15:07    Share:   

ఏటికొప్పాక అంగన్‌వాడీ కేంద్రంలో కిషోర్ వికాస్ కార్యక్రమం...బాలికల భద్రత, పోషకాహారంపై అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది...

( క్రైo అనాలసిస్  రిపోర్టర్ ఆనంద్ )
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక అంగన్‌వాడీ కేంద్రంలో కిషోర్ బాలికల కోసం ప్రత్యేక “కిషోర్ వికాస్” అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బాలికలకు POCSO Act చట్టంపై అవగాహన కల్పిస్తూ, బాలికల రక్షణ, హక్కులు, జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే సమతుల్య ఆహారం (బ్యాలెన్స్‌డ్ డైట్) ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. కృష్ణవేణి, ఏఎన్‌ఎంలు ఎం. లక్ష్మి,  ఆశా వర్కర్ ఎ. సర్వలక్ష్మి పాల్గొని బాలికలకు విలువైన సూచనలు చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు డి. రాజేశ్వరి, ఎస్.ఎస్. కాంతం, జి. సత్యవతి కార్యక్రమాన్ని సమన్వయం చేసి విజయవంతం చేశారు. బాలికల ఆరోగ్యం, భద్రత, వ్యక్తిత్వ వికాసం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు.
Breaking News

Subscribe our Newsletter