నేషనల్ హైవేపై ప్రమాదాల నివార ణకు ఏలూరు ఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలన
29/March/2026 07:29
Share:
నేషనల్ హైవేపై ప్రమాదాల నివార ణకు ఏలూరు ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై నాన్ క్యాడర్ ఎస్పీ శ్రీ ఎన్. సూర్య చంద్రరావు గారు ఇతర డిపార్ట్మెంట్ అధికా రులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు ఏలూరు జిల్లా గుండా వెళ్లే నేషనల్ హైవేపై తరచుగా జరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టి, విలువైన ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం కీలక తనిఖీలు నిర్వహించారు. నాన్-క్యాడర్ ఎస్పీ శ్రీ ఎన్. సూర్యచంద్ర రావు ఇతర శాఖల అధికారులతో కలిసి వట్లూరు నుండి ఆశ్రమ్ హాస్పిటల్ వరకు గల హైవే మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ పరిశీలనలో ఎస్పీ గారితో పాటు నేషనల్ హైవే అథారిటీ అధికారులు,మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఏలూరు త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, మరియు జిల్లా ట్రాఫిక్ రికార్డ్ బ్యూరో అధికారులు పాల్గొన్నారు.ఇంజనీరింగ్ లోపాల గుర్తింపు: శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద రోడ్డు నిర్మాణంలో ఉన్న లోపాలను అధికారులు గుర్తించారు. అక్కడ వాహనాల మళ్లింపు మరియు మలుపుల వద్ద ఉన్న సాంకేతిక లోపాలను సరి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ ఇంజనీర్లకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.వట్లూరు నుండి ఆశ్రమ్ హాస్పిటల్ వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగు తున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డు లు, బ్లింకర్లు మరియు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై చర్చించారు.
రోడ్డు నిర్మాణంలో చిన్నపాటి లోపాల వల్ల కూడా పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన సరి చేయాలని అధికారు లకు సూచించారు.
వాహనదారులు అతివేగంతో వెళ్లకుండా మరియు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.
ఈ సందర్భంగా నాన్ క్యాడర్ ఎస్పీ శ్రీ ఎన్. సూర్యచంద్రరావు మాట్లాడుతూ ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు.హైవేపై భద్రతను పెంచేందుకు పోలీస్,రవాణా మరియు ఎన్‌హెచ్ ఏఐ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.లోపాలను సరి దిద్దడం ద్వారా ప్రమాదాల శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమము ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర రావు గారు, NHAI R E మరియు రెసిడెన్షియల్ ఇంజనీర్ నాగేశ్వరరావు వరాహ ఇన్ఫ్రా లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ డి.మహేష్, Md జమీర్, AMVI, ఏలూరు. డి టి ఆర్ బి మధు పాల్గొన్నారు