మీడియా కథనం ఫలితం. ఏటికొప్పాక ప్రజలకు ఊరటనిచ్చిన కార్యదర్శి ప్రకటన..!

మీడియా కథనం ఫలితం. ఏటికొప్పాక ప్రజలకు ఊరటనిచ్చిన కార్యదర్శి ప్రకటన..!

23/June/2026 19:47    Share:   

అనకాపల్లి జిల్లా ,(క్రైమ్ఎనాలసిస్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై క్రైమ్ న్యూస్‌లో ప్రచురితమైన కథనం అధికారుల దృష్టికి వెళ్లడంతో సంబంధిత ఇన్‌చార్జి కార్యదర్శి కె. గిరిప్రసాద్‌రావు స్పందించారు.
తాను లైనకొత్తూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే, సిబ్బంది కొరత కారణంగా రుక్మిణిపురం, ఏటికొప్పాక గ్రామపంచాయతీలకు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా డిప్యూటీ ఎంపీడీఓ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నందున పరిపాలనా, ఫీల్డ్ స్థాయి విధులకు అధిక సమయం కేటాయించాల్సి వస్తోందని వివరించారు.
ఈ నేపథ్యంలో ఏటికొప్పాక గ్రామ ప్రజల సౌకర్యార్థం ఇకపై ప్రతి వారం మంగళవారం, గురువారం రోజుల్లో గ్రామపంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ప్రకటించారు.
క్రైమ్ న్యూస్‌లో ప్రచురితమైన కథనం అనంతరం కార్యదర్శి స్పందించి గ్రామ ప్రజలకు స్పష్టత ఇవ్వడం పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై మీడియా కథనానికి అధికారులు స్పందించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.
Breaking News

Subscribe our Newsletter