ఏలూరు జిల్లా యంత్రాంగం ఘనత: 22ఏ భూ సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోనే టాప్
16/June/2026 21:27
Share:
ఎన్నో ఏళ్ల భూ సమస్యలకు కూటమి ప్రభుత్వం చొరవతో విముక్తి... లబ్దిదారుల హర్షతిరేకాలు... జిల్లా మంత్రుల చొరవతో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన ఏలూరు జిల్లా కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రభుత్వం 22-ఏ భూ సమస్యలను పరిష్కరించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు బదిలీ చేసింది. దీనివల్ల ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలకు నోచుకోని వేలాది ఎకరాల పట్టా భూములు నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందుతున్నాయి.రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ,జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సూచనలతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచనలతో జిల్లా యంత్రాంగం 22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిచింది. జిల్లాలో ఇంతవరకు 1833 మంది రైతులకు చెందిన 1042.41 ఎకరాలను 22ఏ జాబితా నుండి తొలగించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. ఏలూరు జిల్లాలో 22-ఏ భూ సమస్యల పరిష్కారానికి రెండు సార్లు మెగా మేళా లు నిర్వహించి 216. 06 ఎకరాలను 22ఏ జాబితా నుండి తొలగించారు. ది .16. 12. 2025వ తేదీన మొదటిసారిగా నిర్వహించిన మెగా మేళా లో 1199 మంది ప్రజలకు చెందిన 142. 04 ఎకరాలను, 15. 5. 2026వ తేదీన నిర్వహించిన రెండవ విడత మెగా మేళాలో 290 మంది ప్రజలకు చెందిన 74. 02 ఎకరాలను, మీ సేవా ద్వారా అందిన అర్జీలలో 84 మందికి చెందిన 125 ఎకరాల భూములను 22ఏ జాబితా నుండి తొలగించారు. అంతేకాకుండా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి మండలం కలిదిండి లో రెవెన్యూ రికార్డులలో 1954కు ముందు కేటాయించబడి,“అనాధీనం”గా వర్గీకరించబడిన ఈ భూములను , మరియు అనేక దశాబ్దాలుగా చట్టబద్ధమైన వారసులు, రిజిస్టర్డ్ పత్రాల ద్వారా నిరంతర చట్టబద్ధమైన లావాదేవీలు జరిగిన 260 మంది ప్రజలకు చెందిన 701. 35 ఎకరాల భూములపై జిల్లా యంత్రాంగం భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ కి సమర్పించిన ప్రతిపాదనలపై నిషేధిత జాబితా నుండి తొలగించడానికి గతంలో జారీ చేసిన జీవోలు మరియు సర్క్యులర్ మెమోలలో నిర్దేశించిన షరతులకు ఈ భూములు అనుగుణంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించి వాటిని 22ఏ జాబితా నుండి తొలగించేలా భూపరిపాలన శాఖ ఉత్తరువులను జారీ చేసింది. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి 701. 35 ఎకరాల భూములను నిషేదిత భూముల జాబితా నుండి తొలగించింది. ప్రజల అభిప్రాయాలూ, సూచనలను పరిగణనలోనికి తీసుకుని అమలు చేస్తే ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు వీలు కలుగుతుంది. ప్రజా ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుని ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానీ కేసులకు విముక్తి కలిగించి ఎంతో మంది కళ్ళల్లో ఆనందాల వెలుగులను తీసుకువచ్చింది. ప్రభుత్వం తీసుకున్న సానుకూన చర్యలతో భూమి యజమానులు తమ సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ, 22ఏ భూముల పరిష్కారానికి చర్యలు తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారధి, జిల్లా యంత్రాంగానికి తమ కృతఙ్ఞతలు తెలియజేసారు.