పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి

పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి

08/May/2026 06:30    Share:   

ఏలూరు:
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నూతన కార్యదర్శిగా శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఈ పదవికి నియమించారు.
గతంలో ఆమె ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా సేవలందించారు. బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆమె, శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా సామాన్యులకు న్యాయం చేరవయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయస్థాన సిబ్బంది మరియు పలువురు న్యాయవాదులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కొండల ప్రసాద్, CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
Breaking News

Subscribe our Newsletter