ఏలూరు వంట గ్యాస్ కి ఎటువంటి కొరతాలేదు.. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జె అభిషేక్ గౌడ
10/April/2026 08:03
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి , ఏలూరు.: జిల్లాలో వంట గ్యాస్ కి ఎటువంటి కొరతాలేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జె అభిషేక్ గౌడ చెప్పారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, సోషల్ మీడియాలో గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడనుందంటూ కొన్ని నిరాధారమైన వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, ఇటువంటి అవాస్తవాలను వ్యాపించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాకు ఎటువంటి కొరతలేదని జిల్లా ప్రజలు మరియు గ్యాస్ వినియోగదారులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దన్నారు. . జిల్లాలో గ్యాస్ సిలిండర్ల నిరంతర సరఫరాను నిర్ధారించడానికి పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని, జనవరి నెలలో 3,17,662 సిలిండర్లు, ఫిబ్రవరి నెల యందు 2,72,579 సిలిండర్లు మరియు యుద్దం మొదలైన మార్చి నెలలో జనవరి ఫిబ్రవరి నెలలలో ఇచ్చిన విధముగానే 2,87,500 సిలిండర్లను గృహ అవసరాల నిమిత్తం పంపిణీ చేశామని, అదే విధముగా ఏప్రిల్ నెలలో కూడా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. కావున ప్రజలందరూ గమనించి ఎటువంటి ఆందోళన చెందక అవసరం మేరకే గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసుకోవాలసినదిగా జేసి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. . గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడటానికి మరియు ప్రజల గందరగోళాన్ని నివారించడానికి, ఏలూరు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు, ఏలూరు లోని జిల్లా పౌరసరఫరాల అధికారి వారి కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక "జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్" ను ఏర్పాటు చేయడం జరిగిందని, గ్యాస్ సరఫరాలో ఏవైనా సమస్యలు ఎదురైనా, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా వినియోగదారులు వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, కంట్రోల్ రూమ్ కు సంప్రదించవలసిన ఫోన్ నంబరు : 7569296272 వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ పై నంబర్లను సంప్రదించి తమ ఫిర్యాదులను నమోదు