సబ్ జైలును సందర్శించిన న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షురాలు పి. విజయ
01/May/2026 08:14
Share:
యలమంచిలి పట్టణంలోని సబ్ జైలును గురువారం నాడు మండల న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షురాలు అయిన పి.విజయ సబ్ జైలును సందర్శించి ముద్దాయులు యొక్క సమస్యలు ఖైదీలను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే వారికీ ప్రభుత్వ వకీలను కేటాయించి బెయిలు పెట్టిస్తాం అని చెప్పారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, జైల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా చెప్పమని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరిండెంట్ పి.సుబ్బారావు, జైలు సిబ్బంది, న్యాయ సిబ్బంది, పానల్ లాయర్స్ బి.హరి శంకర్రావు, పీవీ.రమణ తదితరులు పాల్గొన్నారు.