
జిల్లా పరిషత్‌లో అభివృద్ధి మాత్రమే జరుగుతోందని, ఎటువంటి కుట్రలు లేదా అన్యాయాలు లేవని చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆమె విమర్శించారు.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
ఇటీవల బదిలీపై వచ్చిన సీఈఓ జగదాంబ తీరుపై చైర్మన్ ఘంటా పద్మశ్రీ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె బయట వ్యక్తుల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.
జడ్పీ ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయి ఫిర్యాదులు చేస్తున్నారని, దీంతో జడ్పీ ప్రతిష్ట దెబ్బతింటోందని చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 90 లక్షలు వెచ్చించామని తెలిపారు.
కొంతమంది కూటమి నాయకులు తమను బయటకు పంపించాలనే కుట్ర చేస్తున్నారని ఘంటా పద్మశ్రీ దంపతులు ఆరోపించారు. రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని, అభివృద్ధి కోసం కూటమి నాయకుల సహకారంతో పనిచేస్తున్నామని చెప్పారు.
జడ్పీ బడ్జెట్ ప్రకారం అభివృద్ధి జరుగుతోందని, కొన్ని నియోజకవర్గాలకు రాజకీయ ఒత్తిడుల వల్ల ఎక్కువ నిధులు కేటాయించబడుతున్నాయని తెలిపారు. నరసాపురం నియోజకవర్గానికి తక్కువ నిధులు కేటాయించబడినట్టు అంగీకరించారు.