ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద దాడిని ఖండించండి ,సీఐటీయూ

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద దాడిని ఖండించండి ,సీఐటీయూ

14/March/2026 13:32    Share:   

అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద దాడిని ప్రజలంతా వ్యతిరేకించాలని  అచ్చుతాపురంలో  సిఐటియు ఆధ్వర్యంలో యుద్ధ వ్యతిరేక ర్యాలీ ,నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము మాట్లాడుతూ ఇరాన్ పై ట్రంప్ చేస్తున్న దాడులు అత్యధిక మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని ఇరాన్ పై ఇజ్రాయిల్ , అమెరికాల సామ్రాజ్యవాద దాడిని ఖండించని కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరిని  తప్పు పట్టారు. ఇరాన్ మన దేశానికి చిరకాల మిత్ర దేశం. మనకు అవసరమైన  ముడి చమురులో అత్యధిక ఈ దేశం నుండి సరఫరా అవుతుంది. అలాంటి దేశంపై జరుగుతున్న ఈ క్రూర దాడులను కనీసం కేంద్ర బిజెపి ప్రభుత్వం  ఖండించకపోవడం అన్యాయం అని యుద్ధం వద్దు శాంతి కావాలి అని  నినాదాలు చేశారు.
అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై పెత్తనంలో భాగంగా  ఇజ్రాయిల్ తో కలిసి అమెరికా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు కు తీవ్ర నష్టం కలుగుతుంది అన్నారు, వెంటనే యుద్ధాన్ని  ఆపాలని  యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ ధరలను కేంద్ర బి జె పి ప్రభుత్వం పెంచిందని, మనదేశంలో హోటల్స్  సంక్షోభంలో చిక్కుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా పెంచగా, క్షేత్రస్థాయిలో విచ్చలవిడిగా జరుగుతున్న బ్లాక్ మార్కెటింగ్ తో హోటల్ యజమానులు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చిన్న హోటల్ రోడ్డు పక్కన బళ్ళు పై వ్యాపారాలు చేసుకునే వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది.  నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు ఈ యుద్ధం అవకాశం ఇస్తుందని  అన్నారు. చమురు నిక్షేపాల కోసం అమెరికా పన్నుతున్న కుట్రలను ప్రపంచ దేశాల్లో వ్యతిరేకిస్తున్నాయని,  దేశంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం మౌనం వహించి పరోక్షంగా ఇజ్రాయిల్ కు సహకరిస్తోందన్నారు. యుద్ధంలో అమెరికా ఇరాన్ లో ఆసుపత్రిలు, పాఠశాలలపై బాంబుల వర్షంతో పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఐ ఎఫ్ ఆర్ కి వచ్చి వెనక్కి వెళ్తున్న నౌకపై అమెరికా దాడి చేసి 100 మంది ఇరాన్ సైనికులను శ్రీలంక సముద్ర జలాల్లో హత్య గావిచింది అని  అన్నారు.మోడీ ప్రభుత్వం అమెరికాకు జూనియర్ భాగస్వామిగా మారే చర్యలు విడనాడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు సత్యనారాయణ,బయలపూడి శంకరు,నర్సింగరావు తదితరులుపాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter