పి ఏ సి ఎస్ ఉద్యోగుల సమ్మె డిమాండ్లను పరిష్కరించాలి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (పి ఏ సి ఎస్) లలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గత 2 నెలలకు పైగా ఉద్యోగులు అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగులు ఈనెల 16 నుంచి సమ్మె నిర్వహిస్తున్నారు. పిఎసిఎస్ ఉద్యోగుల సమ్మెకు సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివి శ్రీనివాసరావు ఆర్ శంకర్రావులు సంపూర్ణ మద్దతు తెలియజేసారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకొని సమ్మెను విరమింపజేయాలని కోరారు. ఉద్యోగుల వేతనాలు మరియు సర్వీసు కండీషన్ల అమలు కోసం జారీ చేసిన ఆపరేషన్ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. 2019 మార్చి 1 తర్వాత చేరిన ఉద్యోగులను తొలగించకుండా వారిని ఉద్యోగంలో కొనసాగిస్తూనే టెస్ట్‌లు నిర్వహించి రెగ్యులరైజ్ చేయాలని, సహకార చట్టం క్రింద ఉన్న రూల్స్ ప్రకారం సహకార సంఘ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్ల కు పెంచాలని కోరుతున్నారు. 2019, 2024లో కూడా వేతన సవరణ చేయాల్సి ఉంది. అటువంటి వేతన సవరణ కోసం కమిటీ వేసి ఈ లోగా మధ్యంతర భృతికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని వివి శ్రీనివాసరావు అధ్యక్షులు, ఆర్ శంకర్రావు ప్రధాన కార్యదర్శి, డిమాండ్ చేసారు...