మహానేత విగ్రహంపై దాడి దారుణం.. నిందితులను కఠినంగా శిక్షించాలి: యలమంచిలిలో వైఎస్ఆర్‌సీపీ నేతల డిమాండ్

మహానేత విగ్రహంపై దాడి దారుణం.. నిందితులను కఠినంగా శిక్షించాలి: యలమంచిలిలో వైఎస్ఆర్‌సీపీ నేతల డిమాండ్

23/March/2026 21:34    Share:   

క్రైమ్ అనాల్సిస్  KNS Sharma Reporter yelamachali :
కూటమి ప్రభుత్వం వింత ఆచారాలను అవలంబిస్తోందని రాష్ట్ర వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, యలమంచిలి మాజీ ఎంపీపీ బోదేపు గోవింద్ ఆరోపించారు. సోమవారం యలమంచిలిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ గుడివాడ గుర్నాధరావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుష చర్య అని ఖండించారు. ఉత్తరాంధ్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని, ఇది ఒక కొత్త మరియు ఆందోళనకర పరిణామమని అన్నారు.ఈ నెల 20వ తేదీన తగరంపూడిలో ఉన్న గుడివాడ గుర్నాధరావు విగ్రహం చేతులను విరగొట్టడం దారుణ చర్యగా పేర్కొన్నారు. మతాలు, కులాలకు అతీతంగా ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఆయన గుర్తింపు ఉందని తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోద్దపు ఎర్రయ్య దొర, వైస్ చైర్మన్‌లు బెజవాడ నాగేశ్వరరావు, అర్రెపు గుప్తా, మండల పార్టీ అధ్యక్షుడు కొల్లి త్రినాధరావు, కౌన్సిలర్ దూది నరసింహమూర్తి, వైఎస్ఆర్‌సీపీ నాయకులు పిల్లా త్రినాధరావు, ఎడ్ల వాసు, పడాల నాని తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter