డైట్ లో ముగిసిన "ఐసి పినాక 2026" అంతర్జాతీయ సదస్సు

డైట్ లో ముగిసిన "ఐసి పినాక 2026" అంతర్జాతీయ సదస్సు

24/February/2026 19:10    Share:   

దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ లో నిర్వహిస్తున్న"ఐసి పినాక 2026" అంతర్జాతీయ సదస్సు  రెండవ రోజు సెషన్  కు రిసోర్స్ పర్సన్స్ గా  సౌమ్య వంగపూడి మరియు  మౌనిక , ఏఐ, ఫుల్ స్టాక్, డెవలపర్, రోబో కప్లర్ ఆర్గనైజేషన్, విశాఖపట్నం,  పాల్గొని  ఎంతగానో ప్రాముఖ్యత పొందుతున్న “రోబో కపులర్” సంస్థ వారిచే నిర్వహించటం జరిగింది. ఈ వర్క్ షాప్ లో ముఖ్యంగా రోబో యంత్రాలు ఏఐ టెక్నాలజీతో ఏ విధంగా అనుసంధానించబడినవో  స్పష్టంగా ప్రయోగాత్మకంగా    వివరించారు.  భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు . ఈ టెక్నాలజీకి ఉదాహరణలుగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అందుబాటులోకి తెచ్చిన రోబోలను గుర్తు చేశారు. 

ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠ రావు గారు విద్యార్థులను ఉద్దేశించి ఈ ఏ ఐ టెక్నాలజీ వలన భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆవిష్కరణలు మొదలవుతాయని వాటి ద్వారా విద్యార్థుల నైపుణ్యత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.ఈ విభాగంలో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయని వాటిలో ఇంటెన్షిప్స్ చేయటం ద్వారా మరిన్ని కొత్త ప్రాజెక్టులు విద్యార్థులు చేయగలరని వివరించారు. అంతేకాకుండా విద్యార్థులందరూ వారు చేసిన ప్రాజెక్టు పత్రాలను సమర్పించారు. ఈ ముగింపు సదస్సులో బీటెక్ విద్యార్థులు, డిపార్ట్మెంట్ విభాగాధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter