విద్యార్థుల రవాణాకు సంబంధించిన వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

విద్యార్థుల రవాణాకు సంబంధించిన వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

28/February/2026 07:17    Share:   

గోపీనాథ్ జట్టి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం రేంజ్, తుహిన్ సిన్హా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అనకాపల్లి జిల్లా, మరియు ఎం. శ్రావణి మేడం అనకాపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు అనకాపల్లి పట్టణ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినవి.విద్యార్థులు మరియు ఇతర వాహనదారుల సురక్షిత ప్రయాణం దృష్ట్యా స్కూల్, కాలేజ్ బస్సులు మరియు ఆటోలు నడిపే డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్‌టీఓ అధికారులైన ఎంవీఐలు ఎస్. లీలా ప్రసాద్, రాజన్న గార్లు మరియు అనకాపల్లి ట్రాఫిక్ పి.ఎస్. సి.ఐ. ఎం. వెంకట నారాయణ గారు, ఎస్‌.ఐ. శేఖరం గారు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.ఈ డ్రైవ్‌లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ లోడింగ్, వాహన ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్సులు తదితర అంశాలను పరిశీలించారు. ఒక ఆటోపై ఓవర్ లోడింగ్ కేసు నమోదు చేయగా, మొత్తం 16 స్కూల్ బస్సులు మరియు ఆటోలపై వివిధ ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేసి, రూ.56,000/- జరిమానా విధించబడింది.ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల రవాణాకు సంబంధించిన వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.
Breaking News

Subscribe our Newsletter