ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’: ప్రజల సమస్యల పరిష్కారానికి పప్పల చలపతిరావు హామీ

ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’: ప్రజల సమస్యల పరిష్కారానికి పప్పల చలపతిరావు హామీ

15/May/2026 21:17    Share:   

ఎలమంచిలి:
ఎలమంచిలి పట్టణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయం వేదికగా ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్నిశనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ పప్పల చలపతిరావు:
ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పప్పల చలపతి రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆయన స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి,వారి అర్జీలను స్వీకరించి,సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం-చలపతిరావు హామీ:
ఈ సందర్భంగా పప్పల చలపతిరావు గారు మాట్లాడుతూ.. ప్రజా దర్బార్ ద్వారా సేకరించిన ప్రజల సమస్యలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి,వాటన్నింటినీ తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు గొర్లె శివన్నారాయణ (నానాజీ),జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్,క్లస్టర్ ఇంచార్జ్ బొద్దపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.అలాగే యూత్ అధ్యక్షులు నమ్మి రమణ,టౌన్ ఉపాధ్యక్షులు దాంట్ల వెంకటస్వామి,సేనాపతి తులసి రామ్, ఎస్.రమణబాబు,కరెడ్ల మల్లికార్జున్ రావు,గొర్లి బాబురావు,గుర్రాల రాము, కోటి బాబు,అర్జునమూర్తి తదితర ముఖ్య నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 
Breaking News

Subscribe our Newsletter