ఉద్యోగుల హర్షం: 2004కు పూర్వం చేరిన పోలీసులకు CPS/GPS వర్తింపుపై ప్రభుత్వ నిర్ణయం
07/July/2026 21:28
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు పోలీసు శాఖలో 2004 సంవత్సరానికి ముందు చేరిన ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2004కు పూర్వం విధుల్లో చేరిన సిబ్బందిని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధి నుండి తొలగించి, వారికి గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS) / పాత పెన్షన్ సౌకర్యాన్ని వర్తింపజేసేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసు వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పోలీసు శాఖకు చెందిన సిబ్బంది, ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలుకు జిల్లా స్థాయిలో అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు.పోలీసు సిబ్బంది మాట్లాడుతూ, సీపీఎస్ నుండి జీపీఎస్ కు మార్పు వల్ల ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆకాంక్ష నెరవేరిందని, ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసాను కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెద్దలు తీసుకున్న సంక్షేమ నిర్ణయాలు ఉద్యోగులు మరింత ఉత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలు సిబ్బంది అందించాలని.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది మరియు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని వారు హర్షిస్తూ, ముఖ్యమంత్రివర్యులకు తమ కృతజ్ఞతలు తెలిపారు.