క్రైమ్ అనాల్సిస్ టీవీఎస్ ప్రకాష్ :
అన్నమయ్య జిల్లా పీలేరు న్యాయవాదుల సంఘ సభ్యుడు పూజారి ఎల్లయ్యపై జరిగిన హత్యాకాండకు నిరసనగా శుక్రవారం యలమంచిలి న్యాయవాదుల సంఘం సభ్యులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షుడు ఎల్.వి. రామకృష్ణారావు మాట్లాడుతూ, న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో యలమంచిలి న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.