నారా లోకేష్ గారు పునర్వికా చికిత్స నిమిత్తం 6 కోట్ల రూపాయల విరాళం

నారా లోకేష్ గారు పునర్వికా చికిత్స నిమిత్తం 6 కోట్ల రూపాయల విరాళం

27/February/2026 08:24    Share:   

చిన్నారి పునర్వికా కు ప్రాణదానం: యావత్ భారత ప్రజానీకానికి మరియు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు
చిన్నారి పునర్వికా కు వైద్య చికిత్స కోసం అవసరమైన 16 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని సమీకరించడంలో మానవత్వాన్ని చాటుకున్న దేశ ప్రజలందరికీ మరియు ఆపద్బాంధవుడిలా ముందుకొచ్చిన యువనేత శ్రీ నారా లోకేష్ గారికి అనకాపల్లి టీడీపీ మీడియా కోఆర్డినేటర్  ఎస్. భానుచందర్ ఒక పత్రికా ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజల దాతృత్వం పునర్వికా ప్రాణాలు నిలబెట్టేందుకు 16 కోట్లు అవసరం కాగా, పాప పరిస్థితి చూసి యావత్ భారతదేశం కదిలివచ్చింది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా స్పందించి సుమారు 10 కోట్ల రూపాయల వరకు విరాళాలుగా అందించిన ప్రతి ఒక్క దాతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శ్రీ నారా లోకేష్ గారి భరోసా ఇంకా 6 కోట్ల రూపాయల కొరత ఉండిపోయి, పాప కుటుంబం ఆందోళనలో ఉన్న తరుణంలో.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా మానవరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పెద్ద మనసుతో స్పందించారు. మిగతా 6 కోట్ల రూపాయలను తానే అందిస్తానని ప్రకటించి పునర్వికా కుటుంబానికి కొండంత అండగా నిలిచారు కృతజ్ఞతలు కష్టకాలంలో ఆదుకున్న లోకేష్ గారికి, అలాగే తమవంతు సాయం చేసిన కోట్ల మంది ప్రజానీకానికివి పునర్వికా కుటుంబం తరపున, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ గొప్ప సాయం ద్వారా పునర్వికా త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగిరావాలని మనసారా కోరుకుంటున్నాను అని ఎస్. భానుచందర్ అఖి పేర్కొన్నారు.
Breaking News

Subscribe our Newsletter