BCT భూముల పరిరక్షణకు ఎమ్మెల్యేకు గ్రామ కార్యాచరణ కమిటీల వినతి
30/July/2026 13:23
Share:
అనకాపల్లి జిల్లా | యలమంచిలి 46 గ్రామాలకు చెందిన గ్రామ కార్యాచరణ కమిటీలకు చెందిన 75 మంది కన్వీనర్లు, కో-కన్వీనర్లు స్థానిక ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గార్ని కలిసి 356 మంది గ్రామ ప్రతినిధుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
గత 50 సంవత్సరాలుగా మహిళా సాధికారత, వ్యవసాయాభివృద్ధి, యువత నైపుణ్యాభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమం, విద్య, వైద్యం తదితర రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న BCT సంస్థకు చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా పరిరక్షించాలని వినతిలో కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, BCT-KVK ద్వారా రైతులు, మహిళలు, యువత, దివ్యాంగులకు ఎంతో మేలు జరిగిందని, సంస్థ భూములు BCT వద్దే కొనసాగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే గారి సానుకూల స్పందనకు గ్రామ కార్యాచరణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, BCT ద్వారా గ్రామీణ సేవలు నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షించారు.