న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 9,195 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పురుషులకు 9,116 పోస్టులు, మహిళలకు 79 పోస్టులు కేటాయించారు'
తెలుగు రాష్ట్రాల ఖాళీలు:రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 857 ఖాళీలు ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: 504 పోస్టులు
- తెలంగాణ: 353 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వేతనం: నెలకు ₹21,700 నుండి ₹69,100 వరకు (పే లెవల్-3 ప్రకారం).
- వయస్సు: పోస్టును బట్టి నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉంటుంది.
- దరఖాస్తు గడువు: ఆసక్తి గల అభ్యర్థులు 2026, మే 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ (3,176), కుక్ (1,263), బ్యూగ్లర్ (1,426), టెయిలర్ (739), మోటార్ మెకానిక్ (141), పెయింటర్ (547)తో పాటు ఎలక్ట్రిషియన్, మేసన్ వంటి వివిధ ట్రేడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు
ఎంపిక విధానం:అభ్యర్థులను ఐదు దశల్లో ఎంపిక చేస్తారు
- శారీరక దక్షత పరీక్ష (PET)
- శారీరక ప్రమాణాల పరీక్ష (PST)
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- ట్రేడ్ టెస్ట్
- వైద్య పరీక్షలు
దరఖాస్తు రుసుము:
జనరల్ మరియు OBC కేటగిరీ పురుష అభ్యర్థులకు ₹100 ఫీజు ఉంటుంది. SC, ST, మహిళలు మరియు మాజీ సైనికోద్యోగులకు ఎటువంటి ఫీజు లేదు.పూర్తి వివరాల కోసం మరియు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లేదా https://apdsc.net/crpf-constable-recruitment-2026/ ను సందర్శించగలరు.