పూడిమడక ఫ్లైఓవర్ ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో, చిన్నారి దుర్మరణం,
25/April/2026 21:19
Share:
అనకాపల్లి: నిద్రమత్తు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న ఓ చిన్నారిని మృత్యువు రూపంలో కాటేసింది. పూడిమడక ఫ్లైఓవర్ బ్రిడ్జి పై శుక్రవారం (24-04-26) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక పాప అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళితే... తుని వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న మార్గంలో శుక్రవారం వేకువజామున సుమారు 3.45 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అరటి గెలల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం (AP 39 UY 8145), అదే మార్గంలో ఆగి ఉన్న ఒక లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ బొలెరో వాహనంలో డ్రైవర్ తో పాటు ఒక కుటుంబం కూడా ప్రయాణిస్తోంది. ప్రమాద తీవ్రతకు బొలెరో ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, అందులో ఉన్న పాప తల భాగానికి బలమైన గాయాలై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.బొలెరో ఢీకొట్టిన లారీలో ఆర్మీకి సంబంధించిన వస్తువులు/సామాగ్రి ఉన్నట్లు, ఆ కారణంగానే డ్రైవర్ దానిని రోడ్డు పక్కన నిలుపుదల చేసినట్లు సమాచారం.ఈ ఘోర ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి ముందు, తాళ్లపాలెం జంక్షన్ వద్ద రాత్రి విధుల్లో ఉన్న ఒక అధికారి.. బొలెరో డ్రైవర్ మత్తుగా ఉండటాన్ని గమనించి అతడి చేత ముఖం కడిగించి పంపించారు. అనంతరం వారు మార్గమధ్యంలో వాహనం ఆపి టీ కూడా తాగారు. ఆ తర్వాత తిరిగి అనకాపల్లి వైపు వస్తున్న క్రమంలో డ్రైవర్ కు తీవ్రమైన నిద్ర రావడం, దానిని ఆపుకోలేకపోవడం వల్లే నియంత్రణ కోల్పోయి ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. కళ్ళెదుటే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. శ్రీనివాస్ రావు . ఎ క్రైమ్ ఎనాలసిస్ , జిల్లా ఇంచార్జ్,అనకాపల్లి.