జనాభా గణన-2027 పనులపై ఉన్నతస్థాయి సమీక్ష

జనాభా గణన-2027 పనులపై ఉన్నతస్థాయి సమీక్ష

18/May/2026 20:49    Share:   

 రాబోయే జనాభా గణన-2027 పనుల నేపథ్యంలో సెన్సస్ జాయింట్ డైరెక్టర్ దయాసాగర్, జిల్లా ఇన్చార్జ్ జ్యోష్నిల సంయుక్త ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కూడా పాల్గొన్నారు.సమావేశంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లు, పరిపాలనాపరమైన సన్నద్ధతను వారు నిశితంగా పరిశీలించారు. జనాభా గణనను జాతీయ ప్రాజెక్టుగా పేర్కొంటూ, లెక్కింపు ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని జాయింట్ డైరెక్టర్ దయాసాగర్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.సేకరించిన సమాచారం భవిష్యత్తులో ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, వనరుల కేటాయింపుకు ప్రాతిపదికగా మారుతుందని, కాబట్టి ఈ ప్రక్రియలో ఎలాంటి అజాగ్రత్తకు తావు వద్దని ఆయన స్పష్టం చేశారు.మున్సిపల్, రెవెన్యూ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, క్షేత్రస్థాయి సిబ్బందికి సరైన శిక్షణ అందించి, నిర్దేశిత గడువులోపు పనులను పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జ్ జ్యోష్ని అధికారులను ఆదేశించారు.

Breaking News

Subscribe our Newsletter