భవన నిర్మాణ రంగ కార్మికులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్.
15/April/2026 20:59
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, జిల్లాలో భవన నిర్మాణ రంగ కార్మికులకు పలు సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. భవన నిర్మాణ రంగ కార్మికుల భీమా పధకంలో నమోదైన కార్మికులకు వివాహ కానుక పధకం కింద 20 వేల రూపాయలు, ప్రసూతి ప్రయోజనం కింద 20 వేల రూపాయలు, సహజ మరణంనకు 60 వేల రూపాయలు, అంత్యక్రియలకు 20 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలలోపు వయసు కలిగిన భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారు ఈ భీమా పధకానికి అర్హులని, వారి దగ్గరలోని సహాయ కార్మిక శాఖాధికారి కార్యాలయంలో భవన నిర్మాణ రంగ కార్మికుల భీమా పధకంలో నమోదు కావాలన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఒకసారి మాత్రమే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సంవత్సరానికి కేవలం 12 రూపాయలు ప్రీమియం చెల్లించాలన్నారు. వివరాలకు దగ్గరలోని కార్మిక శాఖ కార్యాలయంలో లభ్యమవుతాయన్నారు.