మహిళల భద్రతే లక్ష్యం: అనకాపల్లిలో

మహిళల భద్రతే లక్ష్యం: అనకాపల్లిలో 'మహిళా సేఫ్టీ కిట్' కార్యక్రమం విజయవంతం

24/March/2026 15:25    Share:   

ఈ రోజు అనకాపల్లి జిల్లాలోని జివిఎంసీ పరిధిలో అరుంధతి నగర్ సచివాలయం, దాసరి గడ్డ రోడ్-2 ఆంగన్‌వాడి కేంద్రంలో విప్రో కేర్ మరియు వాసవ్య మహిళా మండలి సంస్థల ఆధ్వర్యంలో మహిళల సేఫ్టీ కిట్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కిశోర బాలికలు (Adolescent Girls) మరియు మహిళలకు భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించబడింది. మహిళల రక్షణ పద్ధతులు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన టోల్-ఫ్రీ నంబర్లు, పోషకాహారం (న్యూట్రిషన్) ప్రాముఖ్యత, బాల్య వివాహాల నివారణపై విపులంగా వివరించబడింది.అరుంధతి నగర్ సచివాలయం, పల్లపు వీధి పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిలా పోలీస్ సత్యదేవి గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ వరలక్ష్మి గారు, దివ్య గారు, అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి గారు మరియు Helper మంగ గారు పాల్గొని మహిళలు మరియు కిశోర బాలికలకు మార్గదర్శకత్వం అందించారు.
మహిళలలో మరియు కిశోర బాలికల్లో భద్రతపై చైతన్యం పెంపొందించడం, స్వీయ రక్షణపై అవగాహన కల్పించడం మరియు సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
Breaking News

Subscribe our Newsletter