యలమంచిలి స్టాప్ అండ్ ఫేస్ వాష్ కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ..!
25/April/2026 21:28
Share:
క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్, యలమంచిలి : యలమంచిలి పట్టణంలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని కొక్కిరాపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేకంగా “స్టాప్ అండ్ ఫేస్ వాష్” కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను పోలీసులు ఆపి, డ్రైవర్లను ముఖాలు కడగించడంతో పాటు కొంత విశ్రాంతి తీసుకుని అప్రమత్తంగా ప్రయాణించాలనే సూచనలు ఇచ్చారు. రాత్రి వేళల్లో నిద్రాహార స్థితిలో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్లు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని డ్రైవర్లకు అవగాహన కల్పించారు.